ముడి చమురు కోసం మధ్య ప్రాచ్య దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకునే ఉద్దేశంతో ప్రత్యామ్నాయాలపై భారత్ దృష్టి సారిస్తోంది. భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా ఇరాక్ కొనసాగుతున్నది. ఆ తరువాతి స్థానాల్లో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా ఉన్నాయి. నైజీరియాను వెనక్కి నెట్టి కువైట్ నాల్గో స్థానానికి చేరగా.. 5వ స్థానాన్ని కెనడా దక్కించుకుంది. నైజీరియా ఆరో స్థానానికి పడిపోయింది.
దేశ ముడి చమురు అవసరాల్లో రష్యా దిగుమతులు ఒక్క శాతం కంటే తక్కువే.. మార్జిన్లను పెంచుకునేందుకు చౌకగా ముడి చమురు లభ్యమయ్యే దేశాలకు భారత్ ప్రాధాన్యం ఇస్తున్నది. అందుకే ఇటీవల భారత్ చమురు దిగుమతుల్లో ఒపెక్ వాటా కూడా తగ్గిపోయింది. గత నెలలో దేశీయ చమురు దిగుమతుల్లో కెనడా, అమెరికా వాటా 14 శాతం పెరిగింది. ఏడాదిలో ఇదే గరిష్టం. ఈసారి అది 11 శాతంగా ఉండొచ్చని కేంద్ర ప్రభుత్వంలోని ఓ అధికారి అంచనా వేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..