Tuesday, November 26, 2024

దేశంలో తొలి మంకీపాక్స్‌ మరణం.. కేర‌ళ‌లోని 22 ఏళ్ల వ్య‌క్తి మృతి..

ఇండియాలో తొలి మంకీపాక్స్‌ మరణం నమోదయింది. కేరళకు చెందిన ఇరవై రెండేళ్ల యువకుడు మంకీపాక్స్‌ తో ఆదివారం మృతి చెందారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి వీణాజార్జ్‌ ప్రకటించారు. ఇది ఇండియాలో తొలి మంకీపాక్స్‌ మరణమని, ఆఫ్రికా వెలుపల నాలుగో మరణమని మంత్రి వీణాజార్జ్‌ వెల్లడించారు. జులై 26న ఆ వ్యక్తి అరబ్‌ ఎమిరేట్స్‌ నుంచి కేరళకు తిరిగి వచ్చారని, యుఏఈలోనే అతనికి మంకీపాక్స్‌ సోకిందని మంత్రి వీణా జార్జ్‌ చెప్పారు. కానీ కుటుంబసభ్యులు మాత్రం యూఏఈ రిపోర్టును శనివారం ఇచ్చారని ఆమె వెల్లడించారు.

అరబ్‌ ఎమిరేట్స్‌ నుంచి వచ్చిన వెంటే ఆ యువకుడి శాంపిల్‌ను ఆరోగ్యశాఖ అధికారులు అలప్పుజ్హా లోని వైరాలజీ విభాగానికి పంపగా డాక్టర్లు పాజిటివ్‌ గా నిర్థారించారని, ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారని ఆమె వెల్లడించారు. మంకీపాక్స్‌ తో మృతి చెందిన యువకుడిది త్రిస్సూర్‌ లోని పున్నియూర్‌ అని, మరణించిన వ్యక్తి అంత్యక్రియలు మంకీపాక్స్‌ ప్రొటోకాల్‌ ప్రకారం నిర్వహించినట్లు ఆమె తెలిపారు. యువకుడి మృతిపై దర్యాప్తుకు ఆదేశించినట్లు ఆమె వెల్లడించారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement