Saturday, November 23, 2024

ఉత్తరాఖండ్‌లో భారతదేశ మొదటి అంతరిక్ష అబ్జర్వేటరీ..

అంతరిక్ష కార్యకలాపాలను పర్యవేక్షించడానికి భారతదేశపు మొదటి అబ్జర్వేటరీ ఉత్తరాఖండ్‌లో రానుంది. ఇది అంతరిక్షంలో వున్న వస్తువులను ట్రాక్‌ చేయగలదు. గుర్తించే ప్రక్రియను మెరుగుపరుస్తుంది. అంతరిక్ష పరిశ్రమ, వాణిజ్య, రక్షణ రంగాలకు సేవలను అందించే హైబ్రిడ్‌ డేటాపూల్‌ను రూపొందించడానికి దారితీసింది” అని చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అనిరుధ్‌శర్మ అన్నారు.
భూమి చుట్టూ తిరుగుతున్న 10 సెంటీమీటర్ల పరిమాణంలో ఉన్న వస్తువులను ట్రాక్‌ చేయడానికి భారతదేశపు మొట్టమొదటి వాణిజ్య అంతరిక్ష పరిస్థితులు అవగాహన అబ్జర్వేటరీని ఉత్తరాఖండ్‌లోని గర్వాల్‌ ప్రాంతంలో అంతరిక్షరంగ స్టార్టప్‌ అయిన దిగంతరా ఏర్పాటుచేసింది. స్పేస్‌ సిట్యువేషనల్‌ అవేర్‌నెస్‌ (ఎస్‌ఎస్‌ఎ) అబ్జర్వేటరీ భారతదేశానికి అంతరిక్ష శిథిలాలు, సైనిక ఉపగ్రహాలతోసహా అంతరిక్షంలో ఏదైనా కార్యాచరణను ట్రాక్‌ చేయడంలో సహాయపడుతుంది.

ప్రస్తుతం యునైటెడ్‌ స్టేట్స్‌ వివిధ ప్రదేశాలలో అబ్జర్వేటరీలు, ప్రపంచవ్యాప్తంగా అదనపు ఇన్‌పుట్‌లను అందించే వాణిజ్య సంస్థలతో అంతరిక్ష శిథిలాలను పర్యవేక్షించడంలో ప్రబలంగా ఉంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య అటువంటి సౌకర్యాల కొరత ఉన్నందున ఉత్తరాఖండ్‌లోని అబ్జర్వేటరీ ఈ ప్రాంతంలో ఎస్‌ఎస్‌ఏ పరిశీలనలలో కీలకమైన అంతరాన్ని భర్తీ చేస్తుంది” అని అనిరుధ్‌శర్మ తెలిపారు. దాని భాగస్వామి భూ ఆధారిత సెన్సార్‌ నెట్‌వర్క్‌తోపాటు అధిక నాణ్యత పరిశీలనలు లోతైన ప్రదేశంలో, ముఖ్యంగా భూస్థిర, మధ్యస్థ భూమి, అధిక-భూమి కక్ష్యలలో సంభవించే సంఘటనలను పర్యవేక్షించే సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

ఈ డేటాతో ఉపగ్రహాలు, ఇతర అంతరిక్ష నౌకలు వాటి స్థానం, వేగం, పథం గురించి మరింత ఖచ్చితమైన అంచనాలను రూపొందించడం ద్వారా వాటి మధ్య ఢీకొనే ప్రమాదాలను తగ్గించగలవు అని శర్మ చెప్పారు. ఈ అబ్జర్వేటరీ ఉపఖండంలో అంతరిక్ష కార్యకలాపాలను పర్యవేక్షించడానికి భారతదేశానికి స్వదేశీ సామర్థ్యాలను కూడా ఇస్తుంది. ఉక్రెయిన్‌లో యుద్ధానికి ముందు అనేక రష్యన్‌ ఉపగ్రహాలు ఈ ప్రాంతంపై కొట్టుమిట్టాయని ఆయన అన్నారు. ఉదాహరణకు చైనీస్‌ ఉపగ్రహాలు భారతదేశంలోని ఒక నిర్దిష్ట ప్రాంతంలో చాలాకాలంపాటు కనిపిస్తే, వాటి కార్యకలాపాలను పర్యవేక్షించగల స్వదేశీ సామర్థ్యం ఇది. దీని గురించి భారతదేశం యుఎస్‌ వంటి దేశాలపై ఆధారపడనవసరంలేదు. ఇది భారతదేశానికి ప్లస్‌ అని శర్మ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement