ఐర్లాండ్‌తో భారత జట్టు టీ20 మ్యాచ్‌లను జరుగుతుండగా ఇవ్వాల (ఆదివారం) రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా.. తొలి మ్యాచ్ లో వాన కారణంగా (డీఎల్ఎస్ ప్రకారం) మ్యాచ్ సోంతం చేసుకున్న భారత్ ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ దక్కించే ప్రయత్నంలో ఉంది. కాగా, గాయం కారణంగా క్రికెట్ కి 11 నెలల పాటు దూరం ఉన్న బుమ్రా ఈ టీ20 మ్యాచ్ కి ప్రాతినిథ్యం వహిస్తుండగా.. తన అద్భుతమైన పునరాగమనంతో భారత్ ఉత్సాహంగా కనిపిస్తోంది.
ఐర్లాండ్‌తో జరిగే రెండవ T20 ఇంటర్నేషనల్‌లో మెరుగైన వాతావరణం జట్టు యువ బ్యాటర్లు తమ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం కోసం ఆశిస్తోంది. సిరీస్ లోని తొలి మ్యాచ్ లో ఐర్లాండ్‌ను ఏడు వికెట్లకు 139 పరుగులకు పరిమితం చేసిన భారత్.. చేజింగ్ లో ఎడతెగని వర్షం కారణంగా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లకు తమ సామర్ధ్యాన్ని నిరూపించుకునే అవకాశాం కలగలేదు. డక్‌వర్త్/లూయిస్ పద్ధతిలో భారత్ రెండు పరుగుల తేడాతో విజేతగా ప్రకటించబడింది.
ఇక దీంతో రెండో గేమ్‌లో పూర్తి మ్యాచ్ ఆడాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఐర్లాండ్ విషయానికొస్తే, బుమ్రా తన మొదటి ఓవర్లోనే రెండు వికెట్లు పడగొట్టిన తర్వాత కోలుకోవడం కష్టమైంది, ఇది భారత జట్టు విజయానికి వేదికగా నిలిచింది. సీనియర్లు లేకపోయినా పటిష్టంగా ఉన్న భారత్‌ను సవాలు చేయాలంటే ఆతిథ్య జట్టు బ్యాట్‌తో మెరుగైన ప్రదర్శన కనబరచాల్సి ఉంటుంది.