Friday, November 22, 2024

22 శాతం పెరిగిన భారత్‌ ఎగుమతులు..

భారత మర్చంటైజ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ 2022 ఫిబ్ర వరిలో 22.36 శాతం పెరిగి 33.81 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఫిబ్రవరిలో 27.63బిలియన్‌ డాలర్లు ఉండగా ఈ ఏడాది 22శాతం పెరిగింది. ప్రస్తుత ఆర్థి క సంవత్సరంలో ఏప్రిల్‌ 2021 నుంచి ఫిబ్రవరి 2022 వరకు మర్చంటైజ్‌ ఎగుమతులు 45.80 శాతం పెరిగి 374.05 బిలి యన్‌ డాలర్లుగా నమోదు అయింది. గత ఆర్థిక సంవ్సతరం ఏప్రిల్‌ 2020 నుంచి 2021 ఫిబ్రవరి మధ్య కాలంలో 256. 55 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. ఈక్రమంలో దిగు మతులు 59.21శాతం పెరిగి 550.12 బిలియన్‌ డాలర్లుకు చేరుకున్నాయి.

దీంతో వాణిజ్య లోటు 176.07 బిలి యన్‌ డాలర్లుకు పెరిగింది. 2020-21 ఏప్రిల్‌-ఫిబ్రవరిలో వాణిజ్యలోటు 88.99 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. ఇంజినీ రింగ్‌, పెట్రోలియం, రసాయన రంగాల్లో ఆశాజనక పనితీరుతో మంచి ఫలితాలు నమోదయ్యాయి. మరోవైపు భారత్‌ 55 బిలియన్‌ డాలర్లు విలువైన ఉత్పత్తులను దిగుమతి చేసు కుంది. దీంతో వాణిజ్య లోటు 21.19 బిలియన్‌ డాలర్లు చేరు కుందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఫిబ్రవరి 2021లో నమోదైన 13.12 బిలియన్‌ డాలర్ల వాణిజ్య లోటుతో పోలిస్తే గతంకంటే పెరిగింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement