Tuesday, November 26, 2024

8 శాతం తగ్గిన భారత ఎగుమతులు, దిగుమతులు.. 17.43 బిలియన్‌ డాలర్లకు చేరిన వాణిజ్య లోటు

ఫిబ్రవరిలో భారతదేశ సరుకుల దిగుమతులు, ఎగుమతులు ఒక్కొక్కటి వార్షిక ప్రాతిపదికన 8 శాతానికి పైగా క్షీణించాయని ప్రభుత్వ గణాంకాలు బుధవారం వెల్లడించాయి. భారతదేశ ఎగుమతులు ఇప్పుడు వరుసగా మూడవ నెలలో దిగువస్థాయికి చేరాయి. ఫిబ్రవరిలో భారతదేశ సరుగుల వాణిజ్య లోటు 17.43 బిలియన్‌ డాలర్లు. ఇది అంతకు ముందు నెలలో నమోదైన 17.75 బిలియన్‌ డాలర్ల కంటే స్వల్పంగా తక్కువగా ఉంది.

ఫిబ్రవరిలో ఎగుమతుల 37.15 బిలయన్‌ డాలర్ల నుంచి 33.88 బిలియన్‌ డాలర్లకు పడిపోయాయి. అయితే, గతేడాది ఇదే నెలలో దిగుమతులు 55.9 బిలియన్‌ డాలర్ల నుంచి 51.31 బిలియన్లకు పడిపోయాయి. భారతదేశ సరుకుల ఎగుమతులు ఏప్రిల్‌- ఫిబ్రవరి కాలంలో 7.55 శాతం పెరిగి, 405.94 బిలియన్‌ డాలర్లకు చేరుకోగా, దిగుమతులు 18.82 శాతం పెరిగి 653.47 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి.

- Advertisement -

ఈ గణాంకాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. మేము వేగాన్ని కొనసాగించగలిగామని వాణిజ్య కార్యదర్శి అన్నారు. ఈ ధోరణిని చూసిన తర్వాత మేము 2023 ఆర్థిక సంవత్సహార లక్ష్యాన్ని అధిగమించగలమని ఆయన అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement