టోక్యో ఒలింపిక్స్‌లో పురుషుల రెజ్లింగ్ సెమీస్‌లో భారత ఆశాకిరణం భజరంగ్ పునియా ఓటమి పాలయ్యాడు. 65 కేజీల విభాగంలో అజర్బైజన్ రెజ్లర్ హాజీ అలిజెవ్తో జరిగిన సెమీస్ పోరులో 12-5 తేడాతో భజరంగ్ పునియా ఓటమి చవిచూశాడు. క్వార్టర్స్‌లో సత్తా చాటిన భజరంగ్ పునియా సెమీస్‌లో ప్రత్యర్థికి ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయాడు. దీంతో భారత్‌పై గెలిచిన హాజీ ఫైనల్‌కి చేరుకున్నాడు.
అంతకుముందు జరిగిన రెండు బౌట్లలోనూ గెలిచి గోల్డ్‌పై ఆశలు రేపిన భజరంగ్.. ఇప్పుడు కాంస్య పతకం కోసం శనివారం తలపడనున్నాడు. రియో గేమ్స్‌లో బ్రాంజ్ మెడల్ గెలిచిన ప్రత్యర్థి హజీ ముందు భజరంగ్ నిలవలేకపోయాడు. తొలి పీరియడ్‌లోనే 4-1 లీడ్‌లోకి దూసుకెళ్లిన అలియెవ్.. రెండో పీరియడ్‌లో మరింత చెలరేగిపోయాడు. ఈ పీరియడ్‌లో భజరంగ్ 4 పాయింట్లు సాధించి పుంజుకోవాలని చూసినా.. అలియెవ్ ఏకంగా 8 పాయింట్లతో సులువుగా గెలిచాడు. ఈ ఓటమితో శనివారం రష్యన్ ఒలింపిక్ కమిటీకి చెందిన రషిదోవ్‌తో బ్రాంజ్ మెడల్ కోసం భజరంగ్ తలపడనున్నాడు.
ఈ వార్త కూడా చదవండి: గోల్డ్ రేసులో గోల్ఫర్ అదితి అశోక్