Friday, November 22, 2024

బధిరుల ఒలింపిక్స్‌లో.. భారత్‌కు మరో స్వర్ణం..

బ్రెజిల్ : బ్రెజిల్‌లో జరుగుతున్న 24వ బధిరుల ఒలింపిక్స్‌ (డెఫిలింపిక్స్‌)లో భారత్‌ మహిళా గోల్ఫర్‌ దీక్ష డాగర్‌ స్వర్ణ పతకం సాధించింది. గురువారం అమెరికా క్రీడాకారిణి యాప్లిన్‌ గ్రేస్‌ జాన్సన్‌తో జరిగిన ఫైనల్‌లో 5-4తో ఓడించి స్వర్ణం చేజిక్కించుకుంది. డెఫిలింజిక్స్‌లో దీక్ష డాగర్‌కు ఇది రెండో పతకం. 2017లో దీక్ష డాగర్‌ రజత పతకం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఓవరాల్‌ డెఫిలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన ఏకైక భారత గోల్ఫర్‌గా దీక్ష డాగర్‌ చరిత్ర సృష్టించింది.

ఇక 2020 టోక్యో ఒలింపిక్స్‌లో చివరి నిముషంలో అర్హత సాధించిన దీక్ష డాగర్‌… ఒలిపింక్స్‌తోపాటు డెఫిలింపిక్స్‌ ఆడిన తొలి గోల్ఫ్‌ ప్లేయర్‌గానూ రికార్డుల్లోకెక్కింది. సెమీఫైనల్‌లో 21 ఏళ్ల దీక్ష డాగర్‌… నార్వే క్రీడాకారిణి అండ్రియా హోవ్‌స్టెయిన్‌పై విజయం సాధించింది. 24వ బధిరుల ఒలింపిక్స్‌లో భారత్‌ మొత్తం మీద 10 పతకాలు చేజిక్కించుకుంది. ఇందులో ఏడు స్వర్ణాలు మూడు కాంస్య పతకాలు ఉన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి

Advertisement

తాజా వార్తలు

Advertisement