Tuesday, November 19, 2024

భారత మహిళల క్రికెట్‌ జట్టు సిద్దం.. తెలుగు తేజం అంజూ శర్వాణికి చోటు

ప్రతిష్టాత్మక టీ 20 ప్రపంచకప్‌ కోసం భారత మహిళల క్రికెట్‌ జట్టు సిద్దమైంది. దక్షిణాఫ్రికా వేదికగా వచ్చే ఫిబ్రవరి 10 నుంచి 26 వరకు జరిగే మెగా టోర్నీకోసం జాతీయ సెలెక్షన్‌ కమిటీ 15 మందితో కూడిన జట్టును ప్రకటించిందిఇ. సీనియర్‌ క్రికెటర్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ కెప్టెన్సీలో భారత్‌ బరిలోకి దిగనుంది. స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మందాన వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. గత ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన టీమ్‌ ఇండియా రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈ సారి ఎలాగైనా కలల కప్‌ను ముద్దాడాలని చూస్తున్న కౌర్‌ సేన అందుకు తగ్గ ప్రణాళికతో ముందుకు వెళుతున్నది. ఓ వైపు ప్రతిభ కల్గిన ప్లేయర్లకు అవకాశమివ్వకపోవడంతో పాటు అనుభంజ్ఞులైన సీనియర్లకు జట్టులో చోటు కల్పించారు. ఇక కెరీర్‌ అయిపోయిందనుకున్న వెటరన్‌ పేసర్‌ శిఖా పాండే తిరిగి జట్టులోకి వచ్చింది. అక్టోబర్‌ 2021లో చివరి సారి భారత్‌ తరపున బరిలోకి దిగిన శిఖా

ఇప్పటివరకు మూడు టెస్టులు, 55 వన్డేలు, 56 టీ 20 మ్యాచ్‌లు ఆడింది. పరిస్థితులకు తగ్గట్టు స్వింగ్‌ బౌలింగ్‌తో చెలరేగే సత్తా ఉన్న శిఖా చేరిక జట్టు బౌలింగ్‌ బలాన్ని పెంచే అవకాశముంది. ఇటీవలె ఆస్ట్రేలియాతో జరిగిన టీ 20 సిరీస్‌ను 1-4తో చేజార్చుకున్న టీమిండియాలోని లోపాలు బయట పడ్డాయి. ముఖ్యంగా పసలేని బౌలింగ్‌ భారత్‌ కొంపముంచుతుంది. రేణుకా ఠాకూర్‌, పూజా వస్త్రాకర్‌ , అంజలి శర్వాణితో పేస్‌ బెంచ్‌ పటిష్టంగా కనిపిస్తుంది. ఆస్ట్రేలియాతో ఇటీవల టీ 20 సిరీస్‌లో సత్తా చాటిన తెలుగు క్రికెటర్‌ అంజలి శర్వాణికి అందుకు తగ్గ ప్రతిఫలం దక్కింది. ఈ సారి ఆమెకు ఏకంగా టీ 20 ప్రపంచకప్‌లో తలపడే భారత జట్టులో చోటు లభించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement