Saturday, November 23, 2024

OLYMPICS: ఒలింపిక్స్‌లో సత్తా చాటుతున్న భారత మహిళలు

ఏ క్రీడాకారుడికైనా ఒలింపిక్స్‌లో పతకం సాధించడం అనేది ఓ కల. అందుకే క్రీడాకారులు ఒలింపిక్స్‌లో పతకం సాధించడానికి ఆరాటపడుతుంటారు. అయితే భారత్‌ సాధించిన గత 10 పతకాల విజేతల్లో ఆరుగురు మహిళలే ఉన్నారు. ఒలింపిక్స్‌లో జరిగే బాక్సింగ్, జిమ్నాస్టిక్స్, వెయింట్ లిఫ్టింగ్ లాంటి పోటీల్లో గెలవాలంటే కండబలం చాలా అవసరం. సాధారణంగా మహిళల కంటే పురుషులకే కండబలం ఎక్కువగా ఉంటుందని పలువురు భావిస్తారు. కానీ ఒలింపిక్స్‌లో మాత్రం కండబలం విషయంలో భారత పురుషుల కంటే మహిళలే సత్తా చాటుతున్నారు.

గత 10 పతకాల సంగతి గమనిస్తే ఆరు పతకాలను మహిళలే కైవసం చేసుకున్నారు. 2012లో లండన్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో బాక్సింగ్‌ విభాగంలో మేరీకోమ్ (కాంస్యం), మహిళల బ్యాడ్మింటన్ విభాగంలో సైనా నెహ్వాల్ (కాంస్యం), 2016లో రియో ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ విభాగంలో పీవీ సింధు (సిల్వర్), రెజ్లింగ్ విభాగంలో సాక్షి మాలిక్ (కాంస్యం), తాజాగా టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి చానూ (సిల్వర్), మహిళల బాక్సింగ్‌లో లవ్లీనా (పతకం ఖాయం) ఈ జాబితాలో ఉన్నారు. అటు ఇప్పటికే మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ విభాగంలో పీవీ సింధు సెమీస్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో గెలిస్తే సింధు కూడా పతకం సాధించిన మహిళల జాబితాలో చేరనుంది.

ఈ వార్త కూడా చదవండి: అదరగొట్టిన లవ్లీనా..భారత్‌కు మరో పతకం ఖాయం

Advertisement

తాజా వార్తలు

Advertisement