Saturday, November 23, 2024

ఈ విషయంలో లేడీస్ ఫస్ట్ కాదండోయ్

దేశంలో కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు ముందుకు వస్తున్నా ఈ విషయంలో మహిళలు వెనుకే ఉన్నారు. జూన్ 12-29 తేదీల మ‌ధ్య అంటే కేవ‌లం ఎనిమిది రోజుల వ్య‌వ‌ధిలో ఇండియాలో భారీగా వ్యాక్సినేష‌న్ జ‌రిగింది. కెన‌డా దేశం మొత్తం జ‌నాభా ఎంత ఉంటుందో అంత మందికి స‌రిప‌డా ఇండియాలో ఈ ఎనిమిది రోజుల్లోనే వ్యాక్సినేష‌న్ పూర్తైంది. ఇంత రికార్డు స్థాయిలో వ్యాక్సినేష‌న్ జ‌రుగుతున్నా మహిళ‌లు వెనుకే ఉన్నారు.

గ‌డిచిన‌ 8 రోజుల్లో 4.61 కోట్ల‌కు పైగా వ్యాక్సిన్‌ డోసుల‌ను కేంద్రం వేసింది. మొత్తంగా 33కోట్ల‌కు పైగా జ‌నం వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇందులో వ్యాక్సిన్ తీసుకున్న మ‌హిళ‌లు 14.99 కోట్ల మంది మాత్ర‌మే. మొత్తం వ్యాక్సినేష‌న్‌లో 46 శాతం. ఇదే స‌మ‌యంలో దాదాపు 17.8 కోట్ల మంది పురుషులు వ్యాక్సిన్ తీసుకున్నారు. అంటే 54 శాతం.

ఈ వార్త కూడా చదవండి: వ్యాక్సిన్ డ్రైవ్… చెన్నై ఆర్టిస్ట్ వినూత్న ప్రయోగం

Advertisement

తాజా వార్తలు

Advertisement