న్యూజిలాండ్‌తో జరిగే టీ 20 , వన్డే సిరీస్ , బంగ్లాదేశ్‌తో వన్డే, టెస్ట్ సిరీస్‌లకు భారత జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది. టీ 20 ప్రపంచకప్ తర్వాత భారత్ న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. ఈ సందర్బంగా ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ 20, మూడు వన్డేల్లో తలపడనున్నాయి. ఆ తర్వాత డిసెంబర్‌లో టీమిండియా బంగ్లా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ భారత జట్టు మూడు వన్డేల సిరీస్, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది.
న్యూజిలాండ్‌తో టీ 20 సిరీస్‌కు కెప్టెన్‌గా హార్దిక్
న్యూజిలాండ్‌లో టీ 20 సిరీస్‌కు హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా సెలక్టర్లు నియమించారు. రిషబ్ పంత్ వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. దినేష్ కార్తిక్‌ను జట్టు నుంచి తప్పించారు. ప్రపంచకప్‌లో దక్షిణాఫికాతో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డ సంగతి తెలిసిందే. శుభమన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, కుల్దిసప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ టీ 20 జట్టులో చోటు లభించింది. దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్‌కు సైతం చోటు దక్కింది. టీ 20 సిరీస్‌లో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్‌కు సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. మరో వైపు మహమ్మద్ షమీని పక్కన పెట్టగా ఉమ్రాన్ మాలిక్ టీ 20 జట్టులో చోటు దక్కింది. చివరి సారిగా ఐర్లాండ్‌తో జరిగిన టీ 20 సిరీస్‌లో ఆడాడు. గంటకు 150 కిలో మీటర్ల వేగంతో బాల్‌ను విసిరే సత్తా ఉన్న ఉమ్రాన్ మాలిక్ స్వదేశంలో న్యూజిలాండ్‌ను ఎదుర్కొనేందుకు ఎంపిక చేశారు.
న్యూజిలాండ్‌తో టీ 20కి భారత జట్టు
హార్థిక్ పాండ్యా (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్- వికెట్ కీపర్), శుభమన్ గిల్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్, (వికెట్ కీపర్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దిసప్ యాదవ్, అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్.
న్యూజిలాండ్‌తో వన్డేలకు శిఖర్ ధావన్
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు కెప్టెన్సీ బాధ్యతలను శిఖర్ ధావన్‌కు సెలెక్టర్లు అప్పగించారు. వన్డేసిరీస్‌కు సైతం రోహిత్ , రాహుల్, కోహ్లీకి విశ్రాంతి ఇచ్చారు. ఈ సిరీస్‌కు రిషబ్ పంత్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అదే సమయంలో టీ 20 సిరీస్ తర్వాత హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇచ్చారుఉ. వన్డే జట్టులోకి మెరుపు బౌలర్ ఉమ్రాన్ మాలిక్ అవకాశం కల్పించారు. ఐపీఎల్ 2022లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన మధ్య ప్రదేశ్‌లోని రెవాకు చెందిన ఫాస్ట్ బౌలర్ కుల్దిసప్ సేన్‌కు అవకాశం వన్డే జట్టులో అవకాశం దక్కింది. మరో వైపు భువనేశ్వర్ కుమార్‌ను తప్పించగా ప్రపంచకప్‌కు ముందు గాయపడిన ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్ పునరాగమనం చేయనున్నారు.
న్యూజిలాండ్ తో వన్డే సిరీస్‌కు భారత జట్టు
శిఖర్ ధావన్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్- వికెట్ కీపర్), శుభమన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దిసప్ యాదవ్, అర్షదీప్ సింగ్, దీపక్ చాహర్, కుల్దిసప్ సేన్, ఉమ్రాన్ మాలిక్.