అమెరికాలోని పర్డ్యూ విశ్వవిద్యాలయంలో చదువుతున్న భారతీయ విద్యార్థి మృతిచెందాడు. భారతీయ విద్యార్థి నీల్ ఆచార్య మృతి చెందినట్లు మంగళవారం విశ్వవిద్యాలయానికి చెందిన కంప్యూటర్ సైన్స్ తాత్కాలిక విభాగాధిపతి క్రిస్ క్లిఫ్టన్ తెలిపారు. అతడి మృతదేహాన్ని క్యాంపస్‌లోని ఓ భవనం వద్ద గుర్తించామని పేర్కొన్నారు.
ఈ నెల 28 నుంచి కనిపించకుండా పోయిన తన కుమారుడి ఆచూకీ చెప్పాలంటూ ఆచార్య తల్లి గౌరీ ఆచార్య ఎక్స్ ద్వారా సాయం కోరడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆచార్యను చివరిసారి ఉబెర్ డ్రైవర్ చూశాడు. యూనివర్సిటీ వద్ద ఆచార్యను వదిలిపెట్టింది అతడే. ఆ తర్వాతి నుంచి విద్యార్థి ఆచూకీ మాయమైంది. ఆచార్య తల్లి పోస్టుకు స్పందించిన చికాగోలోని భారత కాన్సులేట్ జనరల్.. యూనివర్సిటీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపింది. అవసరమైన సాయం అందిస్తామని పేర్కొంది.