Tuesday, November 26, 2024

Stock Market | నిలకడగా స్టాక్ మార్కెట్..

భారత స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులు నమోదు చేశాయి. ఈరోజు సెన్సెక్స్ 231 పాయింట్లు ఎగిసి 82,365 వద్ద ముగిసింది. నిఫ్టీ 83 పాయింట్లు లాభపడి 25,235 వద్ద స్థిరపడింది. ఓ సమయంలో సెన్సెక్స్ 82,637, నిఫ్టీ 25,268 పాయింట్ల వద్ద ఆల్ టైమ్ గరిష్ఠాన్ని తాకాయి. ఆ త‌ర్వాత స్వల్పంగా దిగజారిన నిఫ్టీ 83 పాయింట్ల లాభంతో 25,235 వద్ద ముగిసింది. సెన్సెక్స్ కూడా 82,637 వద్ద రికార్డు స్థాయిని తాకింది, 231 పాయింట్ల పెరుగుదలతో 82,365 వద్ద ముగిసింది.

కాగా, నిఫ్టీ ఇండెక్స్ 1996లో ప్రారంభమైంది. ఇప్పుడు 17 ఏళ్ల తరువాత వరుసగా 12 రోజుల పాటు అత్యధికంగా క్లోజ్ అయి రికార్డు సృష్టించింది. అంతకుముందు 2007లో, నిఫ్టీ వరుసగా 11 రోజుల పెరుగుదలను చూసింది. అలాగే, జనవరి 2015 – ఏప్రిల్ 2014లో వరుసగా 10 రోజుల పెరుగుదల ఉంది.

ఇక బీఎస్ఈలో 2,239 కంపెనీల షేర్లు లాభాల్లో… 1,687 కంపెనీల షేర్లు నష్టాల్లో, 119 కంపెనీల షేర్లు ఎలాంటి మార్పు లేకుండా ముగిశాయి. సెన్సెక్స్ 30లో 21 స్టాక్స్ పెరిగాయి. 9 నష్టపోయాయి. 50 నిఫ్టీ స్టాక్స్‌లో 41 పెరిగాయి. 9 క్షీణించాయి. నిఫ్టీలో సిప్లా టాప్ గెయినర్‌గా నిలిచింది. మీడియా, FMCG మినహా, NSE అన్ని రంగాల ఇండెక్స్ లు బుల్లిష్‌గా ట్రేడ్ అయ్యాయి.

ఆటో, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్, ఫిన్ సర్వీస్, ఫార్మా, రియాల్టీ, మెటల్ షేర్లు లాభపడ్డాయి. ఎఫ్‌ఎంసీజీ, మీడియా మాత్రమే నష్టాల్లో ముగిశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement