భారత్‌గౌరవ్ పేరుతో భారతీయ రైల్వే డీలక్స్ పర్యాటక రైలును సిద్ధంచేసింది. గుజరాత్‌లోని సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించేలా దీని రూట్‌మ్యాప్‌ను రూపొందించారు. ఏక్‌భారత్ శ్రేష్ట భారత్ పథకం కింద ఈ పర్యాటక రైలు గుజరాత్ రాష్ట్ర వారసత్వాన్ని ప్రదర్శించడానికి ఏర్పాటు చేయబడింది.
ప్రముఖ తీర్థయాత్ర స్థలాలు, వారసత్వ ప్రదేశాలైన స్టాచ్యూ ఆఫ్ యునిటీ, చంపానేర్, సోమనాథ్, ద్వారక, నాగేశ్వర్, బేట్ ద్వారక, అహ్మదాబాద్, మోధేరా, పటాన్ ఉన్నాయి. గురుగ్రామ్, రేవారీ, రింగాన్, పుల్లెరా, అజ్మీర్ రైల్వే స్టేషన్ల గుండా ఇది ప్రయాణిస్తుంది. పర్యాటకుల కోసం భారతీయ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సిటిసి) వినియోగదారులకు ఈఎంఐ ప్రాతిపదికన చెల్లింపుల ప్రక్రియను అనుతిస్తోంది.