రష్యా ఆయిల్ కంపెనీతో.. శనివారం.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది. 3 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురును దిగుమతి చేసుకునేందుకు ఇరు దేశాల ఆయిల్ కంపెనీలు సంతకాలు చేసుకున్నాయి. ఇది కంపెనీ టు కంపెనీ డీల్‌గా ఉంటుంది. ఇప్పటికే ఐఓసీ 3 మిలియన్ బ్యారెళ్లను కొనుగోలు చేసింది. హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) కూడా రెండు మిలియన్ బ్యారెళ్లు తీసుకుంది.
యూరప్‌కు చెందిన ట్రేడర్ విటోల్ ద్వారా రష్యన్ ఉరల్స్ క్రూడాయిల్‌ను హెచ్‌పీసీఎల్ కొనుగోలు చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్స్ (ఎంఆర్‌పీఎల్) కూడా అదే తరహాలో ఒక మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్ కోసం టెండర్లు ఆహ్వానించింది. మే నెలలో డెలివరీ కోసం బ్యారెల్‌కు 20-25 డాలర్ల డిస్కౌంట్‌తో ఐఓసీ గత వారమే మూడు మిలియన్ బ్యారెళ్లను విటోల్ సంస్థ ద్వారా కొనుగోలు చేసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..