ఇండియన్ న్యూఏజ్ కంపెనీలు 2021 క్యాలెండర్ ఏడాదిలో దాదాపు 68శాతం మేర మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను కోల్పోయాయి. దలాల్ స్ట్రీట్‌లోకి గత నెలలో ఎంట్రీ ఇచ్చిన ఎన్నో ముఖ్యమైన స్టాక్స్ తమ మార్కెట్ క్యాప్‌ను కోల్పోయాయి. ముఖ్యంగా పేటీఎం పేరెంట్ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్, జొమాటో, ఎఫ్‌ఎస్‌ఎన్ ఈకామర్స్ (నైకా మాతసంస్థ), పీబీ హోల్డింగ్స్ (పాలసీ బజార్), కార్‌ట్రేడ్ టెక్ సంస్థల సంపద భారీగా తగ్గింది. ఈ సంస్థల్లో ఇన్వెస్టర్ల సంపద రూ.2.28 లక్షల కోట్లు క్షీణించింది. అలాగే, ఈ కంపెనీల 52 వారాల గరిష్ట మార్కెట్ క్యాప్‌లో ఇది సగం. ఇదే సమయంలో మొత్తం సెన్సెక్స్ కంపెనీల మార్కెట్ క్యాప్ 8 శాతం క్షీణించింది. ఇరవై రోజుల క్రితం ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.7700 కోట్లుగా ఉంది. ఇందులో వన్ 97 కమ్యూనికేషన్స్ స్టాక్ క్షీణతనే ఎక్కువగా ఉంది.
పేటీఎం ఐపీవో ధర రూ.2150 కాగా, గత నెల చివరి నాటికి రూ.600 దిగువనే ఉంది. అంటే 68శాతానికి పైగా పడిపోయింది. పేటీఎం మార్కెట్‌క్యాప్ రూ.70వేల కోట్లకు పైగా తగ్గింది. ఇక జొమాటో, నైకా మార్కెట్‌క్యాప్ వాటి గరిష్టాల నుండి వరుసగా రూ.65,000 కోట్లు, 53,000 కోట్లు తగ్గింది. పీబీ ఫిన్ టెక్ మార్కెట్ క్యాప్ దాదాపు రూ.35,000 కోట్లు, కార్‌ట్రేడ్ టెక్ దాదాపు రూ.5,000 కోట్లు క్షీణించింది. ఎఫ్‌ఎస్‌ఎన్ ఈకామర్స్ మార్కెట్ క్యాప్ రూ.50వేల కోట్లకు పైగా తగ్గింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..