Friday, November 22, 2024

NAVI: 19 మంది పాకిస్థాన్ నావికుల‌ను కాపాడిన భారత నేవీ

పాకిస్తాన్ కు చెందిన  19 మంది నావికులను భారత సైన్యం కాపాడింది.  ఈ విషయాన్ని భారత నావికాదళం అధికారికంగా ప్రకటించింది. సోమాలియా తూర్పు తీరంలో  సముద్రపు దొంగలు పాకిస్తాన్ కు చెందిన  చేపల వేట నౌకను హైజాక్ చేశారు. దీంతో భారత యుద్ధనౌక ఐఎన్ఎస్  పాకిస్తాన్ కు చెందిన నావికులను రక్షించింది.  36 గంటల్లో యుద్దనౌక జరిపిన రెండో యాంటీ పైరసీ ఆపరేషన్ అని భారత నావికాదళం ప్రకటించింది. 

అల్ నయీమి అనే పాకిస్థాన్‌కు చెందిన పిషింగ్ నౌకపై సామాలియాకు చెందిన 11 మంది దుండగులు దాడి చేశారు. అరేబియా సముద్రంలో కొచ్చికి పశ్చిమాన సుమారు 800 నాటికల్‌ మైల్స్‌ దూరంలో పాకిస్థాన్‌కు చెందిన ఫిషింగ్‌ నౌకపై సోమాలియా సముద్రపు​ దొంగలు దాడి చేశారు. సమాచారం అందుకున్న ఇండియన్ నేవి వెంటనే అప్రమత్తమై.. ‘ఐఎన్ఎస్‌ సుమిత్రా’ యుద్ధనౌక సిబ్బందిని రంగంలోకి దింపింది. పాకిస్థాన్ ఫిషింగ్‌ నౌకను సోమాలియా హైజాకర్ల నుంచి ‘ఐఎన్‌ఎస్‌ సుమిత్రా’ సిబ్బంది రక్షించినట్లు ఇండియన్‌ నేవీ పేర్కొంది. ఇరాన్‌కు చెందిన ఓ ఫిషింగ్‌ నౌకను ఇండియన్‌ నేవి సిబ్బంది సోమవారం రక్షించారు. ఇరాన్‌ దేశానికి చెందిన ఫిషింగ్‌ నౌకను సోమాలియా సముద్రపు​ దొంగలు హైజాక్‌ చేశారు. రంగంలోకి దిగిన ఐఎన్‌ఎస్ సుమిత్రా.. 17 మంది ఇరాన్ దేశస్థులను రక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement