Tuesday, November 26, 2024

ఐదేళ్లలో టీమిండియా షెడ్యూల్​ ఇదే.. స్వదేశంలోనే మ్యాచులు

ఈ ఏడాది సెస్టెంబ‌ర్ నుండి ఐదేళ్ల పాటు (మార్చి 2028) టీమిండియా స్వదేశంలో ఆడ‌బోయే మ్యాచ్ ల‌ వివ‌రాల‌ను బీసీసీఐ వెల్ల‌డించింది. కాగా, 2023 నుండి 2028 వ‌ర‌కు స్వదేశంలో జ‌ర‌గ‌నున్న టోర్న‌మెంట్ల‌లో ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్‌, ఇంగ్లండ్‌, బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌, విండీస్‌, సౌతాఫ్రికాతో పాటు శ్రీలంక వంటి దేశాల‌కు భార‌త్ ఆతిథ్యం ప‌ల‌క‌నుంది. ఇక ఈ ఐదేళ్ల షెడ్యూల్ లో.. స్వ‌దేశంలో జ‌ర‌గున్న ఈ టోర్న‌మెంట్ల‌లో టీమిండియా మెత్తం 9-టీ20 సిరీస్‌లు, 8-వన్డే సిరీస్‌లు, 8-టెస్ట్‌ సిరీస్‌లు ఆడ‌నుంది.

2023-2028 మధ్యలో స్వదేశంలో టీమిండియా ఆడబోయే సిరీస్‌ల వివరాలు..

2023 సెప్టెంబర్‌: ఆస్ట్రేలియాతో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్
2023 నవంబర్‌: ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్
2024 జనవరి: ఆఫ్ఘనిస్తాన్‌తో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌
2024 జనవరి-మార్చి: ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌
2024 సెప్టెంబర్‌-అక్టోబర్‌: బంగ్లాదేశ్‌తో 2 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌, 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌
2024 అక్టోబర్‌-నవంబర్‌: న్యూజిలాండ్‌తో 3 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌
2025 జనవరి-ఫిబ్రవరి: ఇంగ్లండ్‌తో 3 వన్డేలు, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌
2025 అక్టోబర్‌: విండీస్‌తో 2 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌
2025 నవంబర్‌-డిసెంబర్‌: సౌతాఫ్రికాతో 2 టెస్ట్‌లు, 3 వన్డేలు, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌
2026 జనవరి: న్యూజిలాండ్‌తో 3 వన్డేలు, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌
2026 జూన్‌: ఆఫ్ఘనిస్తాన్‌తో టెస్ట్‌, 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌
2026 సెప్టెంబర్‌-అక్టోబర్‌: విండీస్‌తో 3 వన్డేలు, 5 టీ20లు
2026 డిసెంబర్‌: శ్రీలంకతో 3 వన్డేలు, 3 టీ20లు
2027 జనవరి-మార్చి: ఆస్ట్రేలియాతో 5 టెస్ట్‌లు
2027 నవంబర్‌-డిసెంబర్‌: ఆస్ట్రేలియాతో 3 వన్డేలు, 5 టీ20లు
2028 జనవరి-మార్చి: ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement