Saturday, November 23, 2024

మన మెడికోలు విదేశాల్లోనూ ప్రాక్టీస్‌ చేయవచ్చు.. డబ్ల్యూఎఫ్‌ఎంఈ నుంచి ఎన్‌ఎంసీకి గుర్తింపు

మన దేశంలో వైద్య విద్య పూర్తి చేసిన విద్యార్ధులు ఇక నుంచి ఇదేశాల్లోనూ ప్రాక్టీస్‌ చేసుకోవచ్చు, పీజీ పూర్తి చేయవచ్చు. వరల్డ్‌ ఫెడరేషన్‌ ఫర్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డబ్ల్యూఎఫ్‌ఎంఈ) నుంచి నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) 10 సంవత్సరాల కాలానికి గుర్తింపు సాధించింది. అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌తో పాటు డబ్ల్యూఎఫ్‌ఎంఈ గుర్తింపు పొందిన దేశాల్లో మన దేశ వైద్య విద్యార్ధులు ఇక నుంచి పీజీ విద్యలో చేరడంతో పాటు, ప్రాక్టీస్‌ కూడా చేసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ ఒక ప్రకనటలో తెలిపింది.

ఈ గుర్తింపుతోఓ దేశంలోని మొత్తం 706 మెడికల్‌ కాలేజీలకు డబ్ల్యూఎఫ్‌ఎంఈ అక్రిడేషన్‌ హోదా లభించనుంది. దీంతో పాటు వచ్చే 10 సంవత్సరాల్లో దేశంలో ఏర్పాటు చేసే మెడికల్‌ కాలేజీలకు ఆటోమెటిక్‌గా డబ్యూఎఫ్‌ఎంఈ గుర్తింపు లభించనుంది. 2024 నుంచి మన దేశంలో మెడిసిన్‌ చదివిన విద్యార్ధులు విదేశాల్లో ప్రాక్టీస్‌ కోసం, పీజీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ అక్రిడేషన్‌తో మన దేశ మెడికల్‌ కాలేజీలకు, నిపుణులకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించనుందని పేర్కొంది. విదేశాల్లోని వైద్య విద్యా సంస్థలకు, భారత్‌లోని కాలేజీలకు మధ్య సంబంధాలు మెరుగుపడతాయని తెలిపింది.

వైద్య విద్యలో సరికొత్త ఆవిష్కరణలకు ఇది తోడ్పతుందుని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. మన దేశంలో అందించే మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉందనేందుకు డబ్ల్యూఎఫ్‌ఎమ్‌ఈ గుర్తింపు నిదర్శనమని తెలిపింది. ఈ గుర్తింపు మూలంగా విదేశీ విద్యార్ధులను మన దేశ మెడికల్‌ కాలేజీలు ఆకర్షిస్తాయని ఎన్‌ఎమ్‌సీ ప్రతినిధి డాక్టర్‌ యోగేందర్‌ మాలిక్‌ అభిప్రాయపడ్డారు.

అంతర్జాతీయంగా అత్యున్నత స్థాయి ప్రమానాలతో వైద్య విద్యను అందించేందుకు డబ్ల్యూఎఫ్‌ఎమ్‌ఈ కృషి చేస్తోంది. ఈ అక్రిడేషన్‌ కోసం దేశంలోని ప్రతి మెడికల్‌ కాలేజీ నుంచి 60 వేల డాలర్ల రుసుం వసూలు చేశారు. డబ్ల్యూఎఫ్‌ఎమ్‌ఈ గుర్తింపు కోసం మన దేశ కాలేజీలు 4,23,60,000 డాలర్లు ఖర్చు చేశాయి.

- Advertisement -

అమెరికాలో యూఎస్‌ఎంఎల్‌ఈకి నిబంధన

అమెరికాలోని ఎడ్యుకేషన్‌ కమిషన్‌ ఆన్‌ ఫారిన్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (ఈసీఎఫ్‌ఎంజీ) పాత్ర కూడా కీలకగా మారనుంది. ఈ సంస్థ లైసెన్సింగ్‌ ఇంటర్నేషనల్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్స్‌ (ఐఎంజీ) యూనైటెడ్‌ స్టేట్స్‌ మెడికల్‌ లైసెన్సింగ్‌ ఎగ్జామినేషన్‌ (యూఎస్‌ఎంఎల్‌ఈ) ఎగ్జామ్‌ రాసేందుకు తప్పనిసరిగా ఈసీఎఫ్‌ఎంజీ నుంచి సర్టిఫికెట్‌ పొందాల్సి ఉంటుంది. ఈ పరీక్ష అమెరికాలో పీజీ చేయడంతో పాటు, మెడికల్‌ రెసిడెన్షీకి ఉపయోగపడుతుంది.

2024 నుంచి అమెరికా పీజీ వైద్య చదివేందుకు అవసరమైన యూఎస్‌ఎంఎల్‌ఈ పరీక్ష రాసేందుకు విద్యార్ధులు తప్పనిసరిగా డబ్ల్యూఎఫ్‌ఎంఈ గుర్తింపు ఉన్న మెడికల్‌ కాలేజీలో చదివి ఉండాలని నిబంధన పెట్టారు. గతంలో ఈ నిబ ంధన ఆయా దేశాల మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పర్యవేక్షణ సంస్థలు అంటే మన దేశంలో ఎన్‌ఎంసీ లాంటి సంస్థలకు గుర్తింపు ఉంటే దేశంలోని ప్రతి మెడికల్‌ కాలేజీకి గుర్తింపు ఉన్నట్లుగా భావించేవారు.

మారిన నిబంధనల ప్రకారం దేశంలోని ఈ గుర్తింపు ఉన్న మెడికల్‌ కాలేజీ విద్యార్ధులు మాత్రమే ఇక నుంచి యూఎస్‌ఎంఎల్‌ఈ ఎగ్జామ్‌ రాసేందుకు వీలుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మన దేశంలో ఎన్‌ఎంసీ అన్ని మెడికల్‌ కాలేజీలు ఈ గుర్తింపు సాధించేందుకు వీలుగా ఒక్కో కాలేజీ నుంచి 4,98,5142 (60వేల డాలర్లు) రూపాయలు ఫీజుగా చెల్లించింది.

మొత్తం 706 మెడికల్‌ కాలేజీల కోసం 351.9 కోట్లు చెల్లించారు. ఈ ఫీజు చెల్లించిన మెడికల్‌ కాలేజీలు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నదీ లేనిదీ డబ్ల్యూఎఫ్‌ఎంఈ బృందాలు తనిఖీ చేస్తాయి. ఇలా తనిఖీ చేసిన తరువాత కాలేజీల వారికి అక్రిడేషన్‌ గుర్తింపు జారీ చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement