ఏపీలో ప్రతి ఆసుపత్రికి సొంతంగా ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకునే యునిట్ ఉండాలని ఇటీవల ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఒకవేళ ఆక్సిజన్ ప్లాంట్ లేకపోతే ఆస్పత్రిపై వేటు వేస్తామని జీవోలో పేర్కొంది. అయితే సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్రంగా తప్పుబట్టింది. ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు నిబంధనపై ప్రైవేట్ ఆసుపత్రులు అసంతృప్తిగా ఉన్నాయని ఐఎంఏ తెలిపింది.
ఆక్సిజన్ ప్లాంట్ విషయంపై జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాల్సిందేనని ఐఎంఏ అధ్యక్షుడు శ్రీనివాస రాజు స్పష్టం చేశారు. ఇది ప్రాక్టికల్‌గా వర్కవుట్ కాదన్నారు. ఇందులో లాజిక్ కూడా ఏం లేదన్నారు. కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో ప్రభుత్వం రావాల్సిన జీవో కూడా కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీలో ప్రైవేటు ఆసుపత్రుల చైన్ పెద్దది అని, ఇలాంటి సమయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వానికి మంచిది కాదన్నారు.
ఈ వార్త కూడా చదవండి: జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై ఆగస్టు 25న తీర్పు