Friday, November 22, 2024

బయటికెళితే వ్యాక్సినేష‌న్ స‌ర్టిఫికేట్లు త‌ప్ప‌నిస‌రి: ప్ర‌ధానిని కోరిన ఐఎంఏ

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండటంతో ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ ఓ ప్రతిపాదనని ప్రదాని మోదీకి పంపింది. దేశంలో సెకండ్ వేవ్ ఉదృతంగా ఉంద‌ని, అందుకే యుద్ధ ప్రాతిప‌దిక‌ను టీకాలు ఇవ్వాల‌ని కోరింది. దాంతో పాటుగా 18 ఏళ్ల వ‌య‌సు దాటిన వారికి కూడా కోవిడ్ టీకా ఇచ్చే విధంగా అనుమ‌తి ఇవ్వాల‌ని ఐఎంఏ ప్రధాని మోదీకి లేఖ రాసింది. దీంతో పాటు కోవిడ్‌19 వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను మ‌రింత వేగ‌వంతం చేయాల‌ని ప్రధానిని కోరింది ఐఎంఏ. బ‌హిరంగ ప్ర‌దేశాల్లోకి వెళ్లాలంటే వ్యాక్సినేష‌న్ స‌ర్టిఫికేట్ల‌ను త‌ప్ప‌నిస‌రి చేయాల‌ని కోరారు. వైర‌స్ కేసులు అధికంగా ఉన్న నేప‌థ్యంలో నిత్యావ‌స‌రం కాన‌టువంటి సినిమాలు, సాంస్కృతి, మ‌త‌ప‌ర‌మైన కార్య‌క్ర‌మాలు, క్రీడ‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని ఐఎంఏ త‌న లేఖ‌లో తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement