Tuesday, November 26, 2024

తాలిబన్ దాడుల్లో ఇండియన్ జర్నలిస్ట్ మృతి..

ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబన్లకు, అక్కడి భద్రతా దళాలకు మధ్య జరుగుతున్న భీకర పోరును చిత్రీకరించేందుకు వెళ్లిన ఇండియన్ జర్నలిస్టు డానిష్ సిద్ధిఖీ మరణించారు. ప్ర‌ముఖ న్యూస్ ఏజెన్సీ రాయ్‌ట‌ర్స్‌కు ప‌ని చేస్తున్న ఆయ‌న‌ ఆఫ్ఘాన్ లో పరిస్థితిపై రిపోర్ట్ చేస్తున్నాడు. ఆఫ్ఘ‌న్ స్పెష‌ల్ ఫోర్సెస్ వెంట ఉంటూ అక్క‌డి ప‌రిస్థితిపై ఆయ‌న రిపోర్ట్ చేస్తున్నారు. స్పిన్ బోల్డ‌క్‌లోని ప్ర‌ధాన మార్కెట్ ప్రాంతాన్ని ఆఫ్ఘ‌న్ ప్ర‌త్యేక ద‌ళాలు త‌మ ఆధీనంలోకి తీసుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న స‌మ‌యంలో తాలిబ‌న్లు ఫైరింగ్ జ‌రిపారు. ఇందులో సిద్దిఖీతోపాటు ఓ సీనియ‌ర్ ఆఫ్ఘ‌న్ ఆఫీస‌ర్ కూడా మృతి చెందారు. ఈ దాడికి మూడు రోజుల ముందే తాను సుర‌క్షితంగా ఉన్నందుకు చాలా అదృష్ట‌వంతున్ని అని సిద్దిఖీ ట్వీట్ చేశారు. 2018లో రోహింగ్యా శ‌ర‌ణార్థుల స‌మ‌స్య అంశంలో ఆయ‌న చేసిన ప‌నికిగాను సిద్దిఖీకి పులిట్జ‌ర్ అవార్డు వ‌చ్చింది. డానిష్ ఓ అద్భుత‌మైన జ‌ర్న‌లిస్టు. మంచి భ‌ర్త‌, తండ్రి, అంత‌కుమించి మంచి స‌హ‌చ‌రుడు. ఇలాంటి క‌ష్ట స‌మ‌యంలో సిద్దిఖీ కుటుంబానికి అండ‌గా ఉంటాం అని రాయ్‌ట‌ర్స్ ప్రెసిడెంట్ మైకేల్ ఫ్రైడెన్‌బెర్గ్‌, ఎడిట‌ర్ ఇన్ చీఫ్ అలెజాండ్రా గాలోని ఒక ప్ర‌క‌ట‌న‌లో అన్నారు.

ఇది కూడా చదవండి: ఎల్ రమణకు గులాబి కండువా కప్పిన కేసీఆర్..

Advertisement

తాజా వార్తలు

Advertisement