అమెరికాలోని న్యూయర్క్‌లో భారతీయ జర్నలిస్టు మృతి చెందాడు. సెయింట్ నికోలస్ ప్లేస్ అపార్ట్‌మెంట్ భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆయన ప్రాణాలు కొల్పోయాడు. మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు భారత రాయబార కార్యాలయం యత్నిస్తోంది. మృతుడి కుటుంబం, స్నేహితులతో టచ్‌లో ఉంటున్నామని తెలిపింది.
వివరాల ప్రకారం.. కొలంబియా జర్నలిజం స్కూల్ పూర్వ విద్యార్థి ఫాజిల్ ఖాన్ (27) హెచింగర్ రిపోర్ట్‌లో డేటా జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. 2018లో బిజినెస్ స్టాండర్డ్‌లో కాపీ ఎడిటర్‌గా తన వృత్తిని ప్రారంభించారు. కొలంబియా విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ డిగ్రీ కోసం 2020 న్యూయార్క్ వెళ్లడానికి ముందు ఢిల్లీలోని సిఎన్‌ఎన్-న్యూస్‌లో 18లో కరస్పాండెంట్‌గా పనిచేశాడు. ఈ ప్రమాదంలో పాజిల్ ఖాన్ మృతి చెందాడు. కొందరు కిటికీలో నుంచి దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. ఈ ఘటనలో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గొప్ప సహోద్యోగి, అద్భుతమైన వ్యక్తికి సంతాపం తెలుపుతున్నట్లు దిహెచింగర్ పేర్కొంది. వారి కుటుంబానికి సానుభూతి ప్రకటించింది.