టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన భారత హాకీ జట్టు 41 ఏళ్ల తర్వాత పతకాన్ని చేజెక్కించుకుంది. ఒకప్పుడు ఇండియా అంటే హాకీ.. హాకీ అంటే ఇండియాగా పేరుండేది. 1928 నుంచి 1980 మధ్యలో 12 సార్లు ఒలింపిక్స్ జరిగితే హాకీలో 11 పతకాలను భారత్ సాధించిందంటే మనోళ్లు ఏ లెవల్లో ఆడేవారు ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
అంతేకాదు 1928 నుంచి 1956 మధ్యలో మన హాకీ జట్టు వరుసగా ఆరుసార్లు స్వర్ణం సాధించడం విశేషం. ఇప్పటివరకు ఒలింపిక్స్ చరిత్రలో భారత్ 9 గోల్డ్ మెడల్స్ సాధించగా అందులో 8 పతకాలు హాకీ ద్వారా సాధించినవే. రానురాను పరిస్థితులు మారడం.. క్రికెట్ ముందు హాకీ వెలవెలబోవడంతో మన హాకీ క్రీడాకారుల ప్రాబల్యం తగ్గింది.
ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు సాధించిన పతకాలు:
✪ 1928-ఆమ్‌స్టర్‌డమ్- బంగారు పతకం
✪ 1932-లాస్ ఏంజెల్స్-బంగారు పతకం
✪ 1936-బెర్లిన్- బంగారు పతకం
✪ 1948-లండన్- బంగారు పతకం
✪ 1952-హెల్సింకి- బంగారు పతకం
✪ 1956-మెల్‌బోర్న్- బంగారు పతకం
✪ 1960-రోమ్- వెండి పతకం
✪ 1964-టోక్యో- బంగారు పతకం
✪ 1968-మెక్సికో- కాంస్య పతకం
✪ 1972-మ్యూనిచ్- కాంస్య పతకం
✪ 1980-మాస్కో- బంగారు పతకం
✪ 2021-టోక్యో- కాంస్య పతకం