హాకీ ఇండియా గురువారం నిర్వహించిన సెండ్ ఆఫ్ వేడుకలో జట్లను ప్రకటించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను, వారి కుటుంబ సభ్యులను సత్కరించారు. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో నాలుగు గోల్స్ చేసిన ఫార్వర్డ్ ఆటగాడు ఆకాశ్‌దీప్ సింగ్, ఆసియా క్రీడల కోసం భారత పురుషుల హాకీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక ఉమెన్స్ జట్టుకు సవితా పునియా నాయకత్వం వహిస్తుంది..
ఒడిశా హోం మంత్రి తుషారకాంతి బెహెరా, హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ, హాకీ ఇండియా సెక్రటరీ జనరల్ భోలా నాథ్ సింగ్, మాజీ హాకీ అంతర్జాతీయ క్రీడాకారులు A.B సుబ్బయ్య, సాబు వర్కీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పురుషుల జట్టు సెప్టెంబరు 24న ఉజ్బెకిస్థాన్‌తో హాంగ్‌జౌ తమ మోదటి మ్యాచ్ ను ప్రారంభించనుంది. మహిళల జట్టు సెప్టెంబర్ 27న సింగపూర్‌తో తలపడుతుంది.
పురుషుల జట్టు
హర్మన్‌ప్రీత్ సింగ్ (కెప్టెన్), పిఆర్ శ్రీజేష్, క్రిషన్ పాఠక్, వరుణ్ కుమార్, అమిత్ రోహిదాస్, జర్మన్‌ప్రీత్ సింగ్, సంజయ్, సుమిత్, నీలకంఠ శర్మ, హార్దిక్ సింగ్ (వైస్ కెప్టెన్), మన్‌ప్రీత్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, షంషేర్ సింగ్, అభిషేక్, గుర్జంత్ సింగ్, మన్‌దీప్ సింగ్, సుఖ్‌జీత్ సింగ్ మరియు లలిత్ కుమార్ ఉపాధ్యాయ్
మహిళల జట్టు
సవితా పునియా (కెప్టెన్), బిచ్చు దేవి ఖరీబమ్, దీపిక, లాల్‌రెమ్సియామి, మోనిక, నవనీత్ కౌర్, నేహా, నిషా, సోనికా, ఉదిత, ఇషికా చౌదరి, దీప్ గ్రేస్ ఎక్కా (వైస్ కెప్టెన్), వందనా కటారియా, సంగీత కుమారి, వైష్ణవి విట్టల్ ఫాల్కే, నిక్కీ ప్రధాన్ , సుశీల చాను మరియు సలీమా టెటే