పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ సంచలన విజయం సాధించింది. 52 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై టీమిండియా 3-2 స్కోరుతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన భారత్… తొలి అర్ధభాగంలో 2-1 ఆధిక్యంలో నిలిచింది. అనంతరం మరింత దూకుడు పెంచి మరో గోల్ చేసి ఆధిక్యాన్ని పెంచుకుంది.
ఇక చివరి అర్ధభాగంలో ఆస్ట్రేలియా జట్టు విజయం కోసం వీరోచితంగా పోరాడి… చివరి నిమిషంలో ఒక్క గోల్ సాధించింది. దీంతో 2-3 పాయింట్ల తేడాతో భారత్ చేతిలో ఓటమి పాలైంది. పూల్-బిలో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన భారత్.. 3 విజయాలు, 1 ఓటమి, 1 డ్రా తో… 10 పాయింట్లు సాధించి రెండో స్థానంలో కొనసాగుతుంది. కాగా, ఈ గ్రూప్ లో భారత్‌తో పాటు బెల్జియం, ఆస్ట్రేలియా, అర్జెంటీనా క్వార్టర్స్‌లోకి ప్రవేశించాయి.