Saturday, November 23, 2024

దేశ చరిత్రను డిజిటలైజ్ చేస్తున్నాం: కిషన్‌రెడ్డి

భారత దేశ చరిత్రను డిజిటలైజ్ చేస్తున్నట్టు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. భారత దేశ చరిత్రను భావి తరాలకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. చరిత్ర మొత్తాన్ని ఢిల్లీ పురావస్తు శాఖ కేంద్రంలో పొందుపరిచారని తెలిపారు. 18 కోట్ల పేజీల డాక్యుమెంట్లు, 55 లక్షల ఫైళ్లు, 64 వేల అధ్యాయాలు, లక్ష 2 వేల మ్యాపులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

ఢిల్లీలోని సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో కొత్త నిర్మాణాలు వచ్చినా, చారిత్రక సంపదను కాపాడుకుందామన్నారు. పర్యాటక ప్రదేశాల వద్ద జనం గుమికూడొద్దని కోరారు. ప్రజల భాగస్వామ్యంతోనే కరోనాను జయించగలమని చెప్పారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచించారు.

ఈ వార్త కూడా చదవండి: జూలై 19 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement