Tuesday, November 26, 2024

హైద‌రాబాద్‌లో ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ .. హుస్సేన్ సాగ‌ర్ ప్రాంతంలో ఏర్పాట్లు

ఫార్ములా రేసింగ్‌కు హైదరాబాద్‌ అడ్డాగా మారుతున్నది. ఇప్పటికే ఫార్ములా ఈ రేసుకు ఆతిథ్య మిస్తున్న హైదరాబాద్‌ తాజాగా ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌కు వేదిక కాబోతున్నది. దేశంలో తొలిసారి తీసుకొస్తున్న స్ట్రీట్‌ సర్క్యూట్‌ రేసుల్లో ఆరంభ ఎడిషన్‌ వేదికలు ఖరారయ్యాయి. ఈ నెల 14న చెన్నయ్‌లోని మద్రాసు ఇంటర్నేషనల్‌ సర్క్యూట్‌లో ప్రి సీజన్‌ టెస్టు జరగనుంది. ఆ తర్వాత 19,20 తేదీల్లో హుస్సేన్‌ సాగర్‌ పరిసర ప్రాంతాల్లో ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌కు తెరలేవనుంది. చెన్నైలో నవంబర్‌ (25, 27 తేదీల్లో) రేసు జరగనుంది.

హైదరాబాద్‌లో వచ్చే నెల (డిసెంబర్‌) 10, 11 తేదీల్లో జరిగే రేస్‌తో లీగ్‌ ముగియనుంది. దేశంలో ప్రధాన నగరాల సమాహారంగా ఐదు జట్లను ఎంపిక చేశారు. ఇందులో హైదరాబాద్‌ బ్లాక్‌ బర్డ్స్‌, గోవా ఏసెస్‌, చెన్నై టర్బో రైడర్స్‌ , బెంగుళూరు స్పీడ్‌ స్టర్స్‌, స్పీడ్‌ డిమాన్స్‌ డిల్లి జట్లు పోటీలో ఉన్నాయి. హైదరాబాద్‌ జట్టులో కొండా ఆనందిత్‌ రెడ్డితో పాటు నీల్‌ జానీ, అఖిల్‌ రవీంద్ర, లోలా లోవిన్‌ ఫోసీ ఉన్నారు.. మొత్తంగా లీగ్‌లో భారత్‌తో పాటు మిగతా దేశాల నుంచి 24 మంది రేసర్లు లీగ్‌లో ప్రాతి నిద్యం వహిస్తున్నారు. లీగ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే వారు బుక్‌ మై షోలో టికెట్లు కొనుగోలు చేయవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement