అమెరికా, కెనడా సరిహద్దులో నలుగురు భారతీయులు చనిపోయారు. మృతుల్లో ఓ నవజాత శిశువు కూడా కూడా ఉండటం గమనార్హం. వీరంతా అక్కడి చలి తట్టుకోలేక గడ్డకట్టిపోయి చనిపోయినట్టు అధికారులు నిర్ధారించారు. ఇది మానవ అక్రమ రవాణాగా అనుమానిస్తున్నారు. మృతులంతా భారతీయులు అని అమెరికా, కెనడా సరిహద్దు అధికారులు ధృవీకరించారు. విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ దీనిపై స్పందించారు. నలుగురి మృతి ఎంతో బాధాకరమన్నారు. అయితే వారి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. అమెరికా, కెనడాలోని రాయబారులతో మాట్లాడనని తెలిపారు.
ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు. మౌంటోబా రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (ఆర్‌సీఎంపీ) తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికా-కెనడా సరిహద్దులోని ఎమర్సన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో ఇద్దరు పెద్దవాళ్లు, ఓ యువతి, నవజాత శిశువు ఉన్నారు. కెనడా నుంచి అమెరికాలో అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు. రెండు సరిహద్దులకు 12 మీటర్ల దూరంలోనే నలుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మానవ అక్రమ రవాణాలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫ్లోరిడాకు చెందిన 47 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసంఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..