గల్ఫ్ దేశమైన కువైట్లో భారతీయ కుటుంబం ఉంటున్న ఫ్లాట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు పిల్లలతో పాటు ఆ ఇంట్లో ఉన్న భార్యాభర్తలు సజీవ దహనమయ్యారు. ఇంట్లో ఏసీ ఫెయిల్యూర్ కారణంగానే మంటలు చెలరేగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ అప్పటికే ఆ కుటుంబం మంటల్లో సజీవ దహనమైంది.మృతులను కేరళకు చెందిన మాథ్యూ ములక్కల్ (40), అతని భార్య లిని అబ్రహం (38), వారి పిల్లలు ఇరిన్ (14), ఇసాక్ (9)గా గుర్తించారు. ఇటీవలే వాళ్లు కేరళకు వచ్చి… శుక్రవారమే తిరిగి కువైట్కు వచ్చారు. ఇంతలోనే రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఆ కుటుంబం అగ్ని ప్రమాదానికి బలైపోయింది. దీంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.