Tuesday, November 26, 2024

Indian Constitution – రాజ్యాంగం 75వ వార్షికోత్స‌వం..నేడు పార్ల‌మెంట్‌లో రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగం

న్యూఢిల్లీ: భార‌త రాజ్యాంగాన్ని అమలు చేసి నేటికి 75 ఏళ్లు నిండాయి. ఈ సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తోంది. హ‌మారా సంవిధాన్, హ‌మారా స్వాభిమాన్ పేరుతో ప్ర‌చారం నిర్వ‌హిస్తోంది. ఈ నేప‌థ్యంలో భాగంగా మరి కొద్దిసేపట్లో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము.. పార్ల‌మెంట్ ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు.

1949, న‌వంబ‌ర్ 26వ తేదీన భార‌త రాజ్యాంగాన్ని ఆమోదించారు. 1950, జ‌న‌వ‌రి 26వ తేదీ నుంచి దాన్ని అమ‌లు చేస్తున్నారు. భార‌త రాజ్యాంగ 75వ వార్షికోత్స‌వాల సంద‌ర్భంగా ఏడాది పాటు కార్య‌క్ర‌మాలు ఉంటాయి.

- Advertisement -

https: //constitution75.com అనే కొత్త వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించారు. చీఫ్ జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నా నేతృత్వంలో.. సుప్రీంకోర్టులో రాజ్యాంగ దినోత్స‌వాన్ని సెల‌బ్రేట్ చేసుకున్నారు.

. ప్ర‌ధాని మోదీ ఇవాళ సాయంత్రం సుప్రీంకోర్టులో జ‌రిగే కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. రాజ్యాంగ దినోత్స‌వం సంద‌ర్భంగా దేశ ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాని మోదీ గ్రీటింగ్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement