Monday, November 18, 2024

Rakesh Pal | గుండెపోటుతో ఇండియన్ కోస్ట్ గార్డ్ డీజీ రాకేశ్ పాల్ మృతి..

ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ రాకేష్ పాల్ కన్నుమూశారు. గుండెపోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కోస్ట్ గార్డ్ కు సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో కలిసి రాకేశ్ పాల్ చెన్నై వచ్చారు. అయితే, తీవ్ర ఆసౌకర్యానికి గురైన ఆయ‌న‌చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు.

ఈ క్ర‌మంలో చికిత్స పొందుతూ రాకేష్ పాల్ మృతి చెందాడు. రాకేష్ పాల్ మరణవార్త విన్న రాజ్‌నాథ్ సింగ్ ఆసుపత్రికి చేరుకుని పాల్‌కు నివాళులర్పించారు. ఇక ఆయన పార్థివదేహాన్ని దిల్లీకి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.

రాకేశ్ పాల్ 34 ఏళ్ల పాటు దేశానికి సేవలందించారు. సమర్థ్, విజిత్, సుచేత కృపలానీ, అహల్యాబాయి, సీ-03 తదితర భారత కోస్ట్‌గార్డ్ నౌకలకు ఆయన నేతృత్వం వహించారు. ఆయన పర్యవేక్షణలో పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు, రూకోట్లు విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. గతేడాది జులై 19న ఐసీజీ 25వ డైరక్టర్ జనరల్‌గా ఆయన బాధ్యతలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement