ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా ఆలౌట్ అయ్యింది. రెండో రోజు ఆటలో భారత బౌలర్ల విజృంభణతో ఆసీస్ దూకుడుకు అడ్డుకట్ట పడింది. ఓవర్ నైట్ స్కోరు 327-3 తో ఇవ్వాల (గురువారం) తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టు లంచ్ విరామానికి 7 వికెట్లు కోల్పోయి 422 పరుగులు చేసింది. ఈ ఒక్క సెషన్ లోనే టీమిండియా 4 వికెట్లు తీయడంతో ఆసీస్ స్కోరింగ్ రేటు మందగించింది.
ఆ తర్వాత సెకండ్ సెషన్‌లో నూ బౌలర్లు ఆధిపత్యం కనబరిచారు. దీంతో ఆసీస్ 469 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. ఇందులో స్టీవ్ స్మిత్ (121), అలెక్స్ కేరీ (48) పరుగులు మినహా మిగతా బ్యాట్స్‌మన్ పెద్దగా రాణించలేదు. దీంతో నిన్న దూకుడు కనబర్చిన ట్రావిస్ హెడ్ (163) పరుగులతో ఒకదశలో ఆసీస్ భారీ స్కోరు చేసిందనే చెప్పవచ్చు..
ఇక.. ఇవ్వాల సెకండ్ సెషన్‌లో టీమిండియా మరికొద్ది సేపట్లో బ్యాటింగ్‌కు దిగనుంది.