ప్రభన్యూస్ : టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో అరుదైన స్థానంలో నిలిచాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో మూడోస్థానంలో నిలిచాడు అశ్విన్ . బిషన్ సింగ్ బేడి 57వికెట్ల రికార్డును కూడా అశ్విన్ అధిగమించాడు. భారత్-న్యూజిలాండ్ తొలి టెస్టు చివరి రోజు అశ్విన్ ఈ ఘనతను అందుకున్నాడు. అశ్విన్ ఒకేసారి రెండు మైలురాళ్లను దాటాడు. ఐదో రోజు మ్యాచ్ లో కివీస్ బ్యాటర్ టామ్ లాథమ్‌ను అశ్విన్ ఔట్ చేసి తొలుత భజ్జీ 417వికెట్ల సంఖ్యను అధిగమించాడు.
భారత బౌలర్లలో అత్యంత విజయవంతమైన బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో అనిల్ కుంబ్లే (619), కపిల్ దేవ్ (434) తర్వాత మూడో స్థానంలో అశ్విన్ నిలిచాడు. అదేవిధంగా టెస్టు క్రికెట్లో న్యూజిలాండ్ పై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ఉన్న బిషన్ సింగ్ బేడీ (57)ని అశ్విన్ కివీస్ వికెట్ కీపర్ టామ్ బ్లండెల్ ను ఔట్ చేయడం ద్వారా అధిగమించాడు. కాగా న్యూజిలాండ్ పై టెస్టుల్లో అశ్విన్ కు ఇది 58వ వికెట్.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital