Tuesday, November 26, 2024

క‌స్ట‌మర్ల‌కు రెండు అదిరిపోయే ఆఫ‌ర్స్ ఇచ్చిన ఇండియన్ బ్యాంక్..

ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన ఇండియన్ బ్యాంక్.. తాజాగా త‌మ‌ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త అందిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న‌ట్టు వెల్లడించింది. ఇండ్ సూపర్ 400 డేస్ స్కీమ్‌ గడువును ఎక్స్‌టెండ్ చేసింది. ఇండ్ సూపర్ 400 డేస్ అనేది టర్మ్ డిపాజిట్ స్కీమ్. ఈ ఏడాది ఏప్రిల్ 19 వరకే ఈ స్కీమ్ అందుబాటులోకి ఉండాల్సి ఉంది. అయితే బ్యాంక్ ఈ స్కీమ్ గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

దీని వల్ల బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ఊరట కలుగుతుందని చెప్పవచ్చు. కాగా, ఈ స్కీమ్ 2023 జూన్ 30 వరకే అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. కనీసం రూ. 10 వేల మొత్తంతో ఈ ఎఫ్‌డీ స్కీమ్‌లో చేరొచ్చు. రూ. 2 కోట్ల వరకు ఎంతైనా డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్ టెన్యూర్ 400 రోజులు.

దీంతో పాటు మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది ఇండియన్ బ్యాంక్. ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు పెంచిన‌ట్టు తెలిపింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు 10 బేసిస్ పాయింట్లు పెంచిన‌ట్టు వెల్ల‌డించింది. ఈ నెల (ఏప్రిల్) 20 నుంచే ఈ కొత్త వడ్డీ రేట్లు అమలులోకి వచ్చాయి. దీంతో బ్యాంక్ కస్టమర్లకు గతంలో కన్నా ఇకపై అధిక వడ్డీ రేటు లభిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement