నెదర్లాండ్స్ లో అమెరికా రాయబారిగా భారత సంతతి మహిళ నియమితులయ్యారు. షెఫాలీ రజ్‌దాన్ దుగ్గల్‌కు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నట్లు అధ్యక్షుడు జో బిడెన్ ప్రకటించారు. ఈ విషయాన్ని వైట్‌హౌస్ ధ్రువీకరించింది. శుక్రవారం పలు దౌత్య అధికారుల నియామకాలపై వైట్‌హౌజ్ ప్రకటన చేసింది. జమ్ము-కాశ్మీర్‌కు చెందిన దుగ్గల్ ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డారు. సిన్‌సినాటి, చికాగో, న్యూయార్క్, బోస్టన్ నగరాల్లో జీవితం గడిపారు.
దుగ్గల్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. క్రియాశీల రాజకీయ కార్యకర్తగా ఆమెకు గుర్తింపు ఉన్నది. మహిళల, మానవ హక్కుల కోసం పోరాటం చేశారు. న్యూయార్క్ వర్సిటీలో పొలిటికల్ కమ్యూనికేషన్‌లో ఆమె ఎంఏ చదివారు. మియామీ వర్సిటీలో ఆమె మాస్ కమ్యూనికేషన్ పట్టా పొందారు.