యూఎస్‌కు చెందిన ఆల్కియాన్ క్యాపిటల్, ఇప్పటికే భాగస్వామ్యం ఉన్న కొంతమంది పార్టనర్ల నుంచి 266 మిలియన్ డాలర్లు సమీకరించినట్టు ఇండియన్ కంటెంట్ షేరింగ్ ప్లాట్‌ఫామ్ షేర్‌చాట్ ప్రకటించింది. దీంతో కంపెనీ మొత్తం వ్యాల్యూయేషన్ 3.7 బిలియన్ డాలర్లకు చేరిందని వివరించింది. ఈ ఏడాది మూడో రౌండ్ ఫండింగ్‌లో భాగంగా తాజా నిధుల సేకరణ చేశామని కంపెనీ వివరించింది. సింగపూర్‌కు చెందిన ఆల్కియోన్ ఈ రౌండ్‌లో భాగస్వామి అయ్యింది. ఇతర కంపెనీల జాబితాలో మూరే స్ట్రాటజిక్ వెంచర్స్ కూడా ఉంది.
కాగా ఈ ఏడాది జులైలో టిమాసెక్, ఇతర కంపెనీల నుంచి షేర్‌చాట్ 145 మిలియన్ డాలర్లు సేకరించిన విషయం తెలిసిందే. చైనా కంపెనీ బైట్‌డ్యాన్స్‌కు చెందిన టిక్‌టాక్‌పై గతేడాది నిషేధం విధించిన తర్వాత ఇండియన్ కంటెంట్ షేరింగ్, షార్ట్ వీడియో యాప్స్‌కు ఆదరణ పెరిగింది. టిక్‌టాక్ యూజర్లను ఆకర్షించేందుకు పలు కంపెనీలు వినూత్న ఆవిష్కరణలతో ముందుకొచ్చాయి. తమ కంపెనీకి చెందిన రెండు ఉత్పత్తులు మార్కెట్‌లో లీడింగ్‌లో ఉన్నాయని షేర్‌చాట్ సీఈవో అంకుష్ సచ్‌దేవ్ వెల్లడించారు. తాజా ఫండింగ్‌తోతమ స్థానాన్ని మరింత మెరుగుపరచుకుంటామని, అద్భుతమైన సోషల్ మీడియా అనుభవాన్ని అందించేందుకు కృషి చేస్తామని ఆయన వివరించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital