కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇండియన్ 2. అప్పట్లో సంచలనం సృష్టించిన బ్లాక్‌బస్టర్ సినిమా ఇండియన్‌కి సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. తాజా సమాచారం ప్రకారం, చెన్నైలో జరిగిన షూటింగ్ లో ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణను పూర్తి చేసి… షెడ్యూల్‌ను ముగించుకున్నారు మేకర్స్. ఇక ఇప్పుడు ఈ మూవీ తదుపరి షెడ్యూల్ షూటింగ్ కోసం మూవీ టీమ్ యూఎస్ వెల్లనున్నారని సినీ వర్గాల సమాచారం.
యూఎస్ లో జరగనున్న ఈ షూటింగ్ పరది రోజుల పాటు జరగనుందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో కమల్ హాసన్ తో పాటు ఇతరులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఈ సినిమా కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇక, ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికలుగా నటిస్తుండగా, సిద్ధార్థ్ ప్రియా భవానీ శంకర్, సిద్ధార్థ్, బాబీ సింహా, గురు సోమసుందరం ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి రత్నవేలు, రవి వర్మన్ సినిమాటోగ్రాఫర్.