కాన్పూర్‌లో జికా వైరస్ కలకలం సృష్టించింది. 57ఏళ్ల వ్యక్తికి ఈ వైరస్ సోకినట్టు అధికారులు గుర్తించారు. అతని ద్వారా కాంటాక్ట్ అయిన మరో 22 మందిని ట్రేస్ అవుటు చేసి.. వారి బ్లడ్‌శాంపిల్స్ కూడా పరీక్షలకు పంపించారు. వారందరికీ నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని అధికారులు తెలిపారు.
తొలుత అక్టోబర్ 22న 57 ఏళ్ల వ్యక్తికి ఈ వైరస్ సోకినట్టు అధికారులు గుర్తించి బ్లడ్ టెస్టులు చేశారు. దాంతో ఆ టెస్టుల్లో అతనికి పాజిటివ్ రావడంతో ఆందోళన మొదలైంది. జికా వైరస్ ఇన్‌ఫెక్షన్ (దోమల వల్ల కలిగే వైరల్ ఇన్ఫెక్షన్) కేసు కొన్ని రోజుల క్రితం ఇక్కడ జజ్మౌ ప్రాంతంలోని పోఖర్‌పూర్ గ్రామంలో వెలుగుచూసింది. కాన్పూర్‌లోని ఎయిర్‌ఫోర్స్ హాస్పిటల్‌లో ఇది నిర్ధారణ అయ్యిందని కాన్పూర్ డివిజన్ కమిషనర్ రాజ్ శేఖర్ తెలిపారు.
తక్షణమే అడ్మినిస్ట్రేషన్, హెల్త్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో రోగనిర్ధారణ.. నివారణతో పాటు.. అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని రాజశేఖర్ తెలిపారు. హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులతో కలిసి గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు ఆయన చెప్పారు.