విండీస్ తో జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టి20లో నాలుగు పరుగుల తేడాతో ఓడిన భారత్.. వెస్టిండీస్ తో రెండో మ్యాచ్ కు సిద్ధమైంది. గయానాలో ఇరు జట్లు ముఖాముఖి తలపడనున్నాయి. మొదటి టి20లో 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన భారత్.. రెండో టి20లో నెగ్గి సిరీస్ ను సమం చేయాలని పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కమ్‌బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ కూడా ఆశిస్తున్నారు.
ఇక రెండో టి20లో టాస్ నెగ్గిన హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ కోసం భారత్ ఒక మార్పు చేసింది. నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తూ కుల్దీప్ యాదవ్ గాయపడ్డాడు. అతడి స్థానంలో రవి బిష్ణోయ్ తుది జట్టులోకి వచ్చాడు. ఇక వెస్టిండీస్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగనుంది.
తుది జట్లు ఇవే..
టీమిండియా : శుబ్ మన్ గిల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సంజూ సామ్సన్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, యుజువేంద్ర చహల్, అర్ష్ దీప్ సింగ్, ముకేశ్ కుమార్
వెస్టిండీస్ : కైల్ మేయర్స్, జాన్సన్ చార్లెస్, బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్, రొవ్ మన్ పావెల్ (కెప్టెన్), జేసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, అల్జారీ జోసెఫ్, ఒబెద్ మెకాయ్
గయానా వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి ఎనిమిది గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. డీడీ స్పోర్ట్స్‌లో భారత్, వెస్టిండీస్ మ్యాచ్‌ను భారత అభిమానులు లైవ్ చూడవచ్చు. ఇది మాత్రమే కాకుండా జియో సినిమా, ఫ్యాన్‌కోడ్‌లో మ్యాచ్‌ను ఆస్వాదించవచ్చు. అభిమానులు ఫ్యాన్‌కోడ్‌లో మ్యాచ్‌ని చూడటానికి నగదు చెల్లించాల్సి ఉంటుంది. కానీ డీడీ స్పోర్ట్స్, జియో సినిమాల్లో ఉచితంగా చూడవచ్చు.