టీ20 ప్రపంచకప్-2024లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. గ్రూప్-ఎలో భాగంగా నేడు (బుధవారం) భారత్-యూఎస్ఏ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. కాగా, న్యూయార్క్ లోని నసావు కౌంటీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్.. బౌలింగ్ ఎంచుకుని ఆతిథ్య యూఎస్ఏ జట్టును బ్యాటింగ్కు ఆహ్వానించింది.
కాగా, ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా సూపర్-8కి అర్హత సాధిస్తుంది. ఇప్పటికే రెండు జట్లూ రెండేసి విజయాలతో గ్రూప్ పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. టీమిండియా-అమెరికా మధ్య మ్యాచ్ కోసం ఇరు జట్ల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో సూపర్-8 బెర్త్ లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి.
జట్ల వివరాలు
భారత్ : రోహిత్ శర్మ (సి), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికె), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
యునైటెడ్ స్టేట్స్ : స్టీవెన్ టేలర్, షయాన్ జహంగీర్, ఆండ్రీస్ గౌస్ (వికెట్), ఆరోన్ జోన్స్ (సి), నితీష్ ఆర్ కుమార్, కోరీ అండర్సన్, హర్మీత్ సింగ్, షాడ్లీ వాన్ షాల్క్విక్, జస్దీప్ సింగ్, సౌరభ్ నేత్రావల్కర్, అలీ ఖాన్.