సొంతగడ్డపై అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఇప్పటికే 2-0తో కైవసం చేసుకన్న భారత్ ఇప్పుడు మూడో మ్యాచ్‌లోనూ గెలిచి వైట్‌వాష్ చేయాలని చూస్తోంది. మరోవైపు పసికూన అఫ్గానిస్తాన్.. ఎలాగైన చివరి మ్యాచ్‌లో గెలిచి తమ పరవు నిలబెట్టుకోవాలని భావిస్తోంది.
ఇవ్వాల (బుధవారం) బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో భారత్-అఫ్గానిస్తాన్ జట్ల మధ్య చివరి టీ20 మ్యాచ్ జరుగుతొంది. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. వరుస విజయాలతో జోరుమీదున్న రోహిత్ సేనా క్లీన్ స్వీపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శివమ్ దూబే, సంజూ శాంసన్, రింకూ సింగ్, కుల్‌దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్
అఫ్గాన్: రహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), గుల్బాదిన్ నయీబ్, అజ్మతుల్లా ఒమర్‌జయ్, మహ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, కరీమ్ జనత్, షరఫుద్దీన్ అష్రఫ్, ఖాయిస్ అహ్మద్, మహ్మద్ సలీమ్ సఫీ, ఫరీద్ అహ్మద్ మాలిక్