బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. ఇప్పుడు టీ20 సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది. ఈరోజు ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా భారీ విజయం సాధించింది. బంగ్లా ముందు 222 పరుగుల భారీ టార్గెట్ సెట్ చేసిన భారత్ 86 పరుగుల తేడాతో విజయం సాధించి… బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. దాంతో 2-0 తేడాతో సిరీస్ చేజిక్కించుకుంది.
కాగా, బంగ్లాదేశ్ బ్యాటర్లలో మహ్మదుల్లా 41 టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత బౌలర్ల ధాటికి మిగితా బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో బంగ్లాదేశ్ జట్టు 135/9 కే పరిమితమైంది.
భారత బౌలర్లలో… అటు బ్యాటింగ్ లో అదరగొట్టిన నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్లోనూ సత్తా చాటాడు. నితీష్ కుమార్ రెడ్డి, వరుణ్ చక్రవర్తి రెండేసి వికెట్లు పడగొట్టారు. అర్ష్‌దీప్ సింగ్, అభిషేక్ శర్మ, మయాంక్ యాదవ్, రియాన్ పరాగ్ తలో వికెట్ సాధించారు.
అంతకముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 221/9 పరుగులు సాధించింది. నితిశ్ కుమార్ రెడ్డి (34 బంతుత్లో 4ఫోర్లు, 7సిక్సులు *74), రింకూ సింగ్ (26 బంతుత్లో 5ఫోర్లు, 3సిక్సులు *53) తో బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా (19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు *32), రియాన్ పరాగా (6 బంతుల్లో 2 సిక్సర్లు *15) అద్భుత ప్రదర్శన చేశారు.