ఒమన్‌లోని సలాలాలో ఇవ్వాల (మంగళవారం) జరగుతున్న మెన్స్ ఆసియా హాకీ 5 ప్రపంచ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్ లో భారత పురుషుల జట్టు బంగ్లాదేశ్‌తో తన ప్రారంభ పోటీని ప్రారంభించింది. ఈ మ్యాచ్ లో 15-1 స్కోర్ తో బంగ్లాదేశ్ జట్టుని చిత్తుగా ఓడించింది భారత్.
ఈ క్వాలిఫైయర్ మ్యాచ్ లో ఈవేంట్ లోని మొదటి మ్యాచ్ నుంచి ఫుల్ అటాకింగ్ తో సాగిన భారత్.. మొదటి అర్ధభాగం ముగిసేసరికి 7-1 స్కోర్ తో ఆధిక్యంలో ఉంది భారత్. ఇక సెకండాఫ్‌లోనూ ఏమాత్రం తగ్గకుండా అదే దూకుడుతో పాయింట్ల పరంపర కొనసాగించింది. బంగ్లాదేశ్ జట్టుకు సెకండాఫ్‌లో ఒక్క గోల్ కూడా చేసే చాన్స్ ఇవ్వలేదు భారత్. మొదటి అర్ధభాగంలో 7 గోల్స్ చేసిన భారత్.. సెకండాఫ్ లో మరో 8 గోల్స్ చేసి గేమ్ ని 15-1 భారీ స్కోర్ తో దక్కించుంది.
ఇక, రేపు (బుదవారం) ఒమన్, పాకిస్థాన్‌లతో భారత్ పోటీపడుతుంది. ఆపై ఆగస్టు 31న మలేషియా, జపాన్‌లతో తలపడనుంది. కాగా, వచ్చే ఏదాది (2024) హాకీ 5s ప్రపంచ కప్‌లో మొత్తం 16 దేశాలు పోటీ పడనుండగా.. ఆ గ్లోబల్ ఈవెంట్‌లో స్థానం పొందాలంటే.. ప్రస్తుతం జరుగున్న టోర్నీలో భారత్ మొదటి మూడు స్థానాల్లో చేరాల్సి ఉంది.
కాగా, ఈ ప్రపంచ కప్‌లో టోర్నీలో మెత్తం 12 జట్లు పోటీ పడుతుండగా.. రెండు గ్రూప్ లు(ఎలైట్ పూల్, ఛాలెంజర్స్ పూల్)గా విభజించారు. ఎలైట్ పూల్‌లో భారత్ లో పాటు.. మలేషియా, పాకిస్తాన్, జపాన్, ఒమన్ & బంగ్లాదేశ్‌లతో జట్లు ఉన్నాయి. అయితే, ఛాలెంజర్స్ పూల్‌లో హాంకాంగ్, చైనా, ఇండోనేషియా, ఆఫ్ఘనిస్తాన్, కజకిస్తాన్ & ఇరాన్ జట్లు ఉన్నాయి.