- రెండు వికెట్ల తేడాతో టీమ్ ఇండియా విజయం
- ఇంగ్లండ్‌పై భారత జట్టు 2-0 ఆధిక్యం
చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా విజయం సాధించింది. ఉత్కంఠబరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగాడు. దీంతో టీమిండియా రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
కాగా, గత మ్యాచ్‌లో మెరిసిన అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌లో 12 పరుగులకే తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత సంజు (5) కూడా పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో క్రీజులోకి దిగిన తిలక్ వర్మ.. కెప్టెన్ సూర్యతో జతకట్టేందుకు ప్రయత్నించాడు.
సూర్య కుమార్ యాదవ్ 7 బంతుల్లో 12 పరుగుల వద్ద ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన దృవ్ జురెల్ (4), హార్దిక్ పాండ్యా (7) కూడా సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. ఆ తర్వాత వచ్చిన వాషింగ్టన్ సుందర్ (29) రాణించినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు.
అయితే తిలక్ వర్మ ఏమాత్రం తడబడకుండా జట్టును ఆదుకున్నాడు… 55 బంతుల్లో 5 సిక్సర్లు, 4 ఫోర్లతో 78 పరుగులతో నాటౌట్ గా నిలిచి టీమిండియాను ఒంటిచేత్తో విజయతీరాలకు చేర్చాడు.
ఇక ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ (1/60), మార్క్ వుడ్ (1/28), ఆదిల్ రషీద్ (1/14), జామీ ఓవర్టన్ (1/20), లియామ్ లివింగ్‌స్టోన్ (1/14) వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్సే (3/29) వికెట్లు పడగొట్టాడు.
కాగా, ఇంగ్లండ్‌పై ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా మరో అడుగు ముందుకేసింది. దీంతో భారత జట్టు 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. మూడవ టీ20 మ్యాచ్ ఈ నెల 28వ తేదీనన గుజరాత్‌లోని రాజ్‌కోట్ వేదికగా జరగనుంది.