ఫ్లోరిడా వేధికగా ఇవ్వాల (మంగళవారం) వెస్టిండీస్‌తో జరిగిన నలుగో టీ20లో భారత్ విజయం సాధించింది. విండీస్ పై మూడో టీ20లో 9 వికెట్ల తేడాతో గెలిచిన భారత్ ప్రస్తుతం 2-2తో సిరీస్‌లో సమంగా నిలిచంది.
టాస్ గెలిచిన విండీస్ బ్యాటింగ్ ఎంచుకోగా.. నిర్ణీత 20 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఇక చేజింగ్ కు దిగిన భారత్ రెచ్చి ఆడటంతో ఇంకా 18 బంతులు మిగిలి ఉండగానే ఆట ముగించేసింది.
టీమిండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ (51 బంతుల్లో 84 నాటౌట్; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగిపోయాడు. శుబ్ మన్ గిల్ (47 బంతుల్లో 77; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) అలరించాడు. వీరిద్దరు చెలరేగి పోవడంతో భారత్ చెమట పట్టుకుండా విజయాన్ని అందుకుంది. ఇక సిరీస్ విజేతను తేల్చే చివరిదైన ఐదో టి20 ఆదివారం ఇదే గ్రౌండ్ లో జరగనుంది. భారత కాలమానం ప్రకారం మ్యాచ్ రాత్రి 8 గంటలకు ఆరంభం కానుంది.