పారిస్ ఒలింపిక్స్‌లో భాగంగా ఈరోజు జరిగిన హాకీ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించింది. గ్రూప్-బిలో ఉన్న భారత జట్టు తమ ఫస్ట్ మ్యాచ్ లో న్యూజిలాండ్‌తో తలపడగా… ఉక్కంఠ పొరులో 3-2 తేడాతో విజయం సాధించింది.
కాగా, తొలి అర్ధభాగంలోని Q1 (తొలి క్వార్టర్) 8వ నిమిషంలో న్యూజిలాండ్ ప్లేయర్ లేన్ సామ్ ఆ జట్టుకు తొలి గోల్ అందించగా.. Q1 ముగిసే సరికి భారత జట్టు ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. అయితే, ఆ తరువాత Q2 (రెండో క్వార్టర్)లో భారత్ తరఫున మన్‌దీప్ సింగ్ 24వ నిమిషంలో గోల్ చేయడంతో తొలి అర్ధభాగం 1-1తో ముగిసింది.
ఇక రెండో అర్ధభాగంలో Q3 (మూడో క్వార్టర్) 34వ నిమిషంలో భారత్ తరుఫున వివేక్ సాగర్ మరో గోల్ చేశాడు. దీంతో Q3 ముగిసేసరికి భారత జట్టు 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఇక చివరి Q4 (నాలుగో క్వార్టర్)లో న్యూజిలాండ్ ఆటగాడు చైల్డ్ సైమన్ 53వ నిమిషంలో గోల్ చేయడంతో ఇరు జట్ల స్కోరు 2-2తో సమమైంది.
ఇక టైగా ముగుస్తుందని భావించిన ఈ హోరాహోరీ పోరు రెండో అర్ధభాగం Q4 చివరి 59వ నిమిషంలో భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్‌గా మలిచాడు. దీంతో మళ్లీ 3-2తో ఆధిక్యంలోకి వెళ్లిన భారత జట్టు న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. భారత జట్టు 29న అర్జెంటీనా, 30న ఐర్లాండ్, ఆగస్టు 1న బెల్జియం, ఆగస్టు 2న ఆస్ట్రేలియాతో తలపడనుంది.