మరో మూడు రోజుల్లో ప్రారంభం కాబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ విజేతను ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ ముందే చెప్పేశాడు. టీమిండియా తమ అత్యుత్తమ క్రికెట్‌కు కాస్త దగ్గరగా ఆడినా చాలు న్యూజిలాండ్‌పై చాలా ఈజీగా గెలిచేస్తుందని అతడు అన్నాడు. చాలా మంది విశ్లేషకులు అభిప్రాయానికి భిన్నంగా టిమ్ పైన్ స్పందించాడు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఫేవరెట్ అని అందరూ భావిస్తున్నారు. ఇంగ్లండ్‌లోని పరిస్థితులకు కివీస్ ఆటగాళ్లు అలవాటు పడి ఉండటం, ఈమధ్యే ఆ టీమ్‌పై 2 టెస్ట్‌ల సిరీస్‌ను 1-0తో గెలవడం కివీస్‌కు కలిసొచ్చే అంశాలని అందరూ విశ్లేషిస్తున్నారు.
కానీ టిమ్ పైన్ వాదన మరోలా ఉంది. ఇండియా తమ సామర్థ్యానికి తగినట్లు ఆడితే ఈజీగా గెలుస్తుందన్నది తన అంచనా అన్నాడు. ఈ రెండు టీమ్స్‌పై ఆస్ట్రేలియా టీమ్‌కు పైన్ సారథ్యం వహించాడు. న్యూజిలాండ్‌పై 3-0తో గెలవగా.. ఇండియా చేతిలో మాత్రం 1-2తో కంగారూలు ఓడిపోయారు. న్యూజిలాండ్ మంచి జట్టే అయినా.. మొన్నటి సిరీస్‌లో ఇంగ్లండ్ ఆట ఆశ్చర్యపరిచిందని, ఇది కచ్చితంగా ఇంగ్లండ్ బలమైన టీమ్ కానే కాదని పైన్ అన్నాడు.