Friday, November 22, 2024

Population | ముస్లిం జనాభాలో ఇండోనేషియాను దాటిపోనున్న భారత్‌

దేశంలో ముస్లిం జనాభా క్రమేపీ పెరుగుతోంది. 2050 నాటికి ఇండోనేషియాను దాటి పోయే పరిస్థితి ఉందని గ్లోబల్‌ బిజినెస్‌ పబ్లికేషన్‌ సిఈఓ వరల్డ్‌ సర్వే తెలియజేసింది.2020-2030 మధ్య భారత్‌లో ముస్లింల జనాభా 35.62 మిలియన్లకు చేరగలదని ఆ సర్వే తెలిపింది.2050 నాటికి ముస్లిం జనాభా విషయంలో భారత్‌ ఇండోనేషియాను దాటిపోగలదని ఆ సర్వే తెలిపింది.భారత్‌కి ఇస్లామిక్‌ కోఆపరేషన్‌ సంస్థ (ఒఐసీ)లో సభ్యత్వం లేకపోయినా,భారత్‌లో ముస్లిం జనాభా వేగంగా పెరుగుతోందని ఆ సర్వే వివరించింది.

పొరుగున ఉన్న పాకిస్తాన్‌లో ముస్లిం జనాభా 96.5 శాతంగా స్థిరంగా ఉంది.అక్కడ హిందువుల జనాభా 1.9 శాతం,క్రైస్తవుల జనాభా 1.6 శాతం ఉన్నట్టు వివరించింది.నైజీరియాలో 2020-2030 నాటికి ముస్లిం జనాభా35 మిలియన్లకు చేరుకోవచ్చు.ప్రపంచ వ్యాప్తంగా బంగ్లాదేశ్‌ నాల్గవ స్థానంలో ఉంది.అక్కడ హిందూ మైనారిటీల జనాభా 8.1 శాతం ఉంది.ఈ జనాభా పెరుగుదల ప్రభావం వి ద్య,ఆర్థికాభివృద్ధి,ఆరోగ్య రక్షణ,తదితర అంశాలపై పడగలదని ఆ సర్వే హెచ్చరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement